నంద్యాల పట్టణం ఎస్బిఐ కాలనీ రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ వర్కుషాప్ ను నిర్వహిస్తున్నట్లు మంగళవారం డివిజనల్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ సమస్యలు, ఫైబర్ సమస్యలు, నూతన కనెక్షన్ల కొరకు సంప్రదించాలని కోరారు. ఈ వర్క్ షాప్ నందు సలహాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. నంద్యాలలో బిఎస్ఎన్ఎల్ 4జి అప్డేట్ చేశామని తెలిపారు.