పల్లె పండుగలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి వెండర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలు, మండల ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి జనార్దన్ రావు, హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్ తదితరులు పాల్గొన్నారు.