నంద్యాల పట్టణంలోని ఉప్పరి వీధిలో శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ చివరి పూజలు అందుకుందని శ్రీ వీరాంజనేయ స్వామి కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి నిమజ్జనోత్సవం ఉంటుందని, శోభాయాత్రలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి ఒడి బియ్యాలు సమర్పించారు.