మహానంది పుణ్యక్షేత్రంలో కనుల పండువగా గంగా హారతులు

80చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో నేత్ర శోభితంగా గంగా హారతులు నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కోనేరు వద్ద కొలువుతీర్చి పంచోపచార పూజలు సోమవారం నిర్వహించారు. అనంతరం గంగా నదికి షోడశోపచార పూజానంతరం దశవిధ హారతులను సమర్పించారు. అనంతరం గంగాదేవికి సారే సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హారతులను వీక్షించారు.

సంబంధిత పోస్ట్