ఉర్దూ కేంద్రీయ విద్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడతానని, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాల ఆవరణంలో ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన జిల్లా వార్షిక మహా సభ జరిగింది. ఈ మహాసభలో ఎంపీ మాట్లాడుతూ.. ఉర్దూను రెండవ అధికారిక భాషగా చేసిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.