నంద్యాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ఒకటో వార్డులో అరుంధతి నగర్ లోక్షుద్ర పూజలు కలకలం రేపాయి. రోడ్డుపై ఒక బొమ్మ గీసి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి చేతబడి చేశారు అని స్థానికులు తెలిపారు. క్షుద్ర పూజలతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, చెప్పులు, జుట్టు వెంట్రుకలు, కుంకుమ, పసుపు మొదలగునవి చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.