నంద్యాల పట్టణంలో రాష్ట్రస్థాయి కెనోయింగ్ & కయాకింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ, న్యాయవాది పబ్బతి అపర్ణ తెలిపారు. ఆదివారం డ్రాగన్ బోట్ రేస్ కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమలోనే తొలిసారిగా నంద్యాలలో జరుగుతున్న ఈ పోటీలకు మంచి స్పందన లభించిందని, విజేతలు నేషనల్ లెవెల్ పోటీలకు అర్హత సాధిస్తారని శనివారం పేర్కొన్నారు.