రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం 2. 0 పథకం ద్వారా జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ ఆవరణంలో దీపం 2. 0 పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డీఎస్ఓ వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.