పోలీసులు బాగుంటేనే సమాజం బాగుంటుంది: నంద్యాల ఎస్పీ
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మెడికల్, రక్తదాన శిబిరం సోమవారం ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులతో పాటు ఎస్పీ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఎవరికైనా అత్యవసర సమయాల్లో ఈ రక్తం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పోలీసులు బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందిని పేర్కొన్నారు.