హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ 10 మందిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్‌ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి మృతి చెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు.