పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు (వీడియో)

55చూసినవారు
AP: పిఠాపురం పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు కనిపించాయి. ఇవాళ స్వామిని దర్శించుకున్న అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకుడు డి.వెంకటేష్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆదిత్య పులిహోర తిన్నారు. అందులోని శనగపప్పులో పురుగులు కనిపించాయి. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు విచారణ చేపడతామని ఎండోమెంట్ ఆర్జేసీ సుబ్బారావు, డీసీ రమేష్‌బాబు తెలిపారు. ‘సిబ్బందిని విచారిస్తామని, అప్పటివరకు ప్రసాదంపై అపోహలు పెట్టవద్దు’ అని వారు కోరారు.

సంబంధిత పోస్ట్