జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
నంద్యాల: జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా బుధవారం న్యాయమూర్తి వాసు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మండల లీగల్ సెల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా చట్టాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. న్యాయమూర్తి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఓబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాంసు రెడ్డి, పెద్దస్వామి, పునీత్, తదితరులు పాల్గొన్నారు.