Jan 22, 2025, 07:01 IST/
అనంతపురంలో నేడు డాకు మహారాజ్ సక్సెస్ మీట్
Jan 22, 2025, 07:01 IST
AP: అనంతపురంలో నేడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందం హాజరుకానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేశారు.
ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురంలో సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే బాలయ్య, చిత్ర యూనిట్ హిందూపురం చేరుకుంది.