ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్హా శాంతివనాన్ని ఇవాళ(ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో ప్రత్యేకంగా పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.