Feb 15, 2025, 08:02 IST/
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయింపు!
Feb 15, 2025, 08:02 IST
హైదరాబాద్లోని నోవాటెల్లో గ్రీన్ తెలంగాణ సమ్మిట్ నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బిల్డర్లకు స్వర్గధామం హైదరాబాద్ అని.. గ్రీన్ సిటీగా మార్చేందుకు పలునిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. నగరంలో దశలవారీగా డీజిల్ వాహనాలు నిషేధిస్తామని.. మూసీ పునర్జీవానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని భట్టి ధీమా వ్యక్తం చేశారు.