అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు
పాములపాడు మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ వాదులు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, ఆదర్శ యువజన సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.