ఇబ్రహీంపట్నం: సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం

68చూసినవారు
ఇబ్రహీంపట్నం: సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం
ఇబ్రహీంపట్నం మండల పరిధి చర్లపటేల్ గూడలోని చంద్రాయణగుట్ట మహాత్మ జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. టీచర్ల వేదింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడంతో వెన్నెముక విరిగి తీవ్ర గాయాలయ్యాయి. టీచర్స్ తిట్టడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఘటనకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల టీచర్లపై చర్యలు తీసుకోవాలని తండ్రి నాగరాజు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్