చంద్రబాబు అక్రమ అరెస్టు ఫలితం వైసీపీ పతనం ప్రారంభమైందని నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. సోమవారం హుశేనాపురంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పని చేశారన్నారు. అక్రమ అరెస్టుకు నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సంఘీభావం ప్రకటించాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా మద్దతు పలికారని, 70 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావం ప్రదర్శనలు చేశారని అన్నారు.