పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల అభివృద్ధికి అడ్డుపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత హెచ్చరించారు. బుధవారం కల్లూరు మండల పరిషత్ ఆఫీసులో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవం కల్పించి గ్రామ పంచాయతీలకు ప్రాణం పోసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సభ్యులు తెలిపిన సమస్యలు మళ్లీ పురానవృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.