సెల్‌ఫోన్, గూగుల్ అన్ని తనే కనిపెట్టినట్టు, పరిపాలనలో అపార అనుభవం ఉందంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పత్తికొండ మాట్లాడారు. హామీలు అమలు చేయకపోతే గ్రామాల్లో ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తారన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు.