పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మన శంకర్ రెడ్డి (74) అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు, నంద్యాల పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి, వెంకటరెడ్డిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో శంకర్ రెడ్డి పాడెను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మోశారు.