ఆత్మకూరు మండలంలోని ముష్టేపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గడివేముల జట్టు విజేతగా నిలిచింది. టోర్నమెంట్ చివరి రోజైన బుధవారం గడివేముల, ముష్టేపల్లి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగ్గా ఈ మ్యాచ్ లో గడివేముల జట్టు ఘన విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.40,016 నగదును అందజేశారు.