ఆత్మకూరు పట్టణంలోని చక్రం హోటల్ సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని సాధువు మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే స్థానిక యువకుల చొరవతో సాధువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.