ప్రస్తుతం ఉన్న కోర్టులకు అదనంగా మరిన్ని న్యాయస్థానాలను ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యంకే గురురాజారావు, రఘురాం కోరారు. గురువారం ఎమ్మిగనూరులో న్యాయవాదులు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శేషఫణికి వినతిపత్రం అందజేశారు. గ్రామ న్యాయలయాలు ఏర్పాటు చేయడం వల్ల ఏలాంటి ఉపయోగం లేదన్నారు.