కర్నూలు జిల్లాలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హంద్రీనీవా నుంచి 60 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. 4. 5 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 2. 2 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని తెలిపారు.