ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం భక్తుల శివనామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తేరుబజారు ప్రాంతం జనసంద్రమైంది. రథ వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వేదపండితుల వేదమంత్రాల నాదంతో ఆదిదంపతులను మహారథంపై స్థాపించి, రథాన్ని మార్కండేయుడి సన్నిధికి తీసుకెళ్లి పూజల అనంతరం యథాస్థానానికి చేర్చారు.