ఉపాధి పనులు కల్పించండి- ఎంపిడిఓ కిరణ్

558చూసినవారు
ఉపాధి పనులు కల్పించండి- ఎంపిడిఓ కిరణ్
నందవరం మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి పనులు చేపట్టాలని MPDO కిరణ్ మోహన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా ప్రతి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలన్నారు. నిర్దిష్ట కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ. 300 వేతనం అందుతుందని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్