ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే లీవ్ కట్ చేస్తాం: HCL

72చూసినవారు
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే లీవ్ కట్ చేస్తాం: HCL
HCL తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కనీసం వారంలో 3 రోజులు ఆఫీసుకు రాకుంటే వాటిని లీవ్స్‌గా పరిగణిస్తామని తమ ఉద్యోగులకు HCL తేల్చిచెప్పింది. నెలకు 12రోజులు ఆఫీసులో పనిచేయాలన్న నిబంధన ప్రస్తుతం నడుస్తోంది. అంతకంటే తక్కువగా ఆఫీసుకు వస్తే మాత్రం రాని ప్రతి రోజును సంస్థ లీవ్స్ నుంచి మినహాయించనుంది. ఒకవేళ ఉద్యోగికి లీవ్స్ అయిపోతే జీతం నుంచి రోజు శాలరీని కట్ చేస్తామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్