ఎమ్మిగనూరు: నిరసన విరమించబోం: గోవిందమ్మ

60చూసినవారు
రావణ సంహారం, నరకాసుర వద జరిగిన ఈ దేశంలో స్త్రీని వివస్త్రను చేసిన వాళ్లకు శిక్ష పడదా అంటూ బాధితురాలు గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేశమే ఆశ్చర్యపోయేలా తనను వివస్త్రను చేసిన వాళ్ళను శిక్షించాలని కోరుతూ.. శనివారం ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ నందు దీక్ష కొనసాగించారు. నేటి వరకు 20మంది పై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు తూతూ మంత్రంగా నీకు న్యాయం చేశాం అంటున్నారని, అసలైన నిందితులపై చర్యలు తీసుకునేంతవరకు నిరసన విరమించబోమని అన్నారు.

సంబంధిత పోస్ట్