నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి సమయానికి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు రోడ్డుపై పడి ఉన్న రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.