నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి ప్రహారి గోడపై చిరుత పులి నడుచుకుంటూ వచ్చింది. ఇంట్లో ఉన్న కుక్కపై దాడి చేసి ఎత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.