శ్రీశైలంలో చిరుతపులి కలకలం

55చూసినవారు
శ్రీశైలంలో చిరుతపులి కలకలం
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి చిరుత సంచారం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అర్ధరాత్రి సమయంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి సంచించిన వీడియోలు రికార్డయ్యాయి. టోల్ గెట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి చిరుతపులి నోటితో పట్టుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్