ఏపీ రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం: షర్మిల

60చూసినవారు
ఏపీ రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం: షర్మిల
పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్య ఘటన అత్యంత దారుణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. 'నడిరోడ్డుపై ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు. ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్థుడిని కఠినంగా శిక్షించాలి. రాజకీయ హత్య అయితే కూటమి ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీటికి అడ్డుకట్ట వేస్తారా? లేదా? రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్