సమాజంలోని సంగతులన్నింటినీ ఇంటింటికీ చేరవేసే సామాజిక సారథులు వారు.. సూర్యోదయానికి ముందే ఇంటి తలుపులు తట్టి ఆత్మీయంగా పలకరించే ఆత్మీయ అతిథులు. వర్షాలు కురుస్తున్నా, చలి కొరికేస్తున్నా.. లెక్కచేయకుండా విధేయతకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు. బతుకుదెరువు కోసం పార్ట్‌టైం పనిచేస్తూ, ఎన్ని ఒడిదుడుకులున్న వాటిని ఎదుర్కొంటు, విరామమెరుగని కార్మికులే పేపర్ బాయ్స్. ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు చెబుతున్నామంటే ఇవాళ అంతర్జాతీయ వరల్డ్ పేపర్‌బాయ్స్ డే.