లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి

1049చూసినవారు
లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి
లైన్‌మెన్ కూర రామయ్య చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి మధ్య నిలిచిపోయిన విద్యుత్‌ను ప్రాణాలకు సైతం తెగించి రామయ్య పునరుద్ధరించిన సంగతి మంత్రి రవికుమార్ దృష్టికి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్