AP: సచివాలయంలో నేడు పశుసంవర్ధక, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల ఆసుపత్రి భవనాల నిర్మాణాలు, మరమ్మతులు అవసరం ఉన్నవి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.