AP: వైఎస్ జగన్ పాలనపై మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో నేడు ఆయన పర్యటించారు. రూ.1.38 కోట్లతో చేపట్టిన రోడ్లు, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. జగన్ పాలనలో రోడ్లన్నీ నరక మార్గాలుగా మారాయన్నారు. పోలవరం పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీరు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.