ఫ్రాన్స్‌లోని మయోట్ ద్వీపంలో చిడో తుపాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వల్ల ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, 1400 మందికి పైగా గాయపడ్డట్టు అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మేయర్ అంబిల్‌వాహెడౌ సౌమైలా తెలిపారు. కరెంటు సరఫరాలో అంతరాయంతో పాటు ప్రజలు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పరిస్థితిపై సమీక్షించారు.