రుణ యాప్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

66చూసినవారు
రుణ యాప్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
రుణయాప్ నిర్వాహకుల వేధింపులతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో మురికింటి వంశీ (22) మృతదేహం లభ్యమైంది. విజయవాడకు చెందిన వంశీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ.10 వేలు రుణం తీసుకుంటే రూ.లక్ష కట్టాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దాంతో వంశీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్