దిశ మార్చుకున్న అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

52చూసినవారు
దిశ మార్చుకున్న అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి, దానికి ఆనుకొని ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తన దిశ మార్చుకుంది. ఈ అల్పపీడన ప్రభావంతో గురువారం ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్