గుంటూరు జిల్లా కొరిటపాడు సమీపంలోని మెయిన్ రోడ్డు పక్కన పండ్ల దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గమనించిన పండ్ల దుకాణ యజమాని మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని పేరు షేక్ ఆసిఫ్ అని, ఆనందపేట వాసిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.