చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు: మాజీ సీఎం

571చూసినవారు
చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు: మాజీ సీఎం
సమర్థుడైన చంద్రబాబు మరోసారి సీఎం కావడం సంతోషంగా ఉందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కేంద్రం సాయంతో సమస్యలను పరిష్కరించాలి. రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గత ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసింది. నేను సీఎంగా ఉండి ఉంటే మళ్లీ జిల్లాలను కలిపేవాడిని.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్