AP: భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.