AP: సీఎం చంద్రబాబు సతీమణి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రతి మహిళా తమలోని శక్తిని గ్రహించాలని, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని పట్టుదలతో ఉండాలని అన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. హెరిటేజ్‌ను చంద్రబాబు తన చేతిలో పెట్టే సమయంలో తనకు ఏమి తెలియదని, పట్టుదలతో పని నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. కుప్పం మహిళలు కూడా మంచి స్పూర్తితో ముందుకు సాగాలన్నారు.