ఏపీలో వరదలు మిగిల్చిన విపత్తు అంత ఇంత కాదు. ఇప్పటికీ కొన్ని ముంపు ప్రాంతాలు వరదలోనే జీవనం కొనసాగిస్తున్నాయి. అలాంటి వారిని ఆదుకోవటం కోసం రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. వరద బాధితుల కోసం హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి నారా లోకేష్ ను కలిసి రూ. 10 లక్షల చెక్ సాయి ధరమ్ తేజ్ సీఎంఆర్ఎఫ్‌కు అందజేశారు.