మీ ఆధార్ కార్డ్ 10 సంవత్సరాల క్రితం జారీ చేయబడి ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి. ఈ మేరకు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. అప్డేట్ చేసుకోవడం కోసం myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ లో ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. తర్వాత మీ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. అవి 2 MB కంటే తక్కువ సైజులో, JPEG, PNG, PDF ఫార్మాట్లలోనే ఉండాలి.