TG: అవమానభారంతో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల(D), గంభీరావుపేట(M)లోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి జనవరి 1న తన తరగతికి చెందిన ఓ విద్యార్థినితో మాట్లాడాడు. ఇది గమనించిన యువకులు అతన్ని కొట్టారు. విద్యార్థిని తల్లి సైతం విద్యార్థితోపాటు అతని తల్లిని దూషించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థి అదే రోజు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.