దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పద్దతిలో జరిగిన లావాదేవీల సంఖ్య డిసెంబరులో 1673 కోట్లకు చేరింది. నవంబరు నాటి 1548 కోట్ల లావాదేవీలతో పోలిస్తే, గత నెలలో 8% పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. డిసెంబరులో రోజుకు సగటున రూ.74,900 కోట్ల లావాదేవీ విలువ నమోదు కాగా, నవంబరులో ఇది రూ.71,840 కోట్లుగా ఉంది.