ఏపీలో అమలవుతున్న మద్యం విధానంపై వైఎస్ జగన్, వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో మద్యం, ఇసుకపై వచ్చిన ఆదాయాన్ని దోచుకుని ఇప్పుడు సక్రమంగా అమలువుతున్న విధానాలపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసింది తమరు కాదా అని ప్రశ్నించారు.