ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైఎస్సార్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. బద్వేలులో విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన గురించి అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇంటర్ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.